మాస్కో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి రెగ్యులర్ విమానాలతో పాటు చార్టర్ ఫ్లైట్స్‌ను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖను రష్యా ప్రభుత్వం ఆదేశించింది. అయితే విదేశాల నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే విమానాలకు సడలింపు ఉంటుందని రష్యా అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోజువారి విమానాల నియంత్రణకు ఇంతకుముందే రష్యా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి)
కోవిడ్: రష్యా కీలక నిర్ణయం